Header Banner

విశ్వవిద్యాలయాల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా ప్రభుత్వ చర్యలు! వైసీపీ హ‌యాంలో అనేక అక్ర‌మాలు..

  Thu Mar 13, 2025 14:09        Politics

రాష్ట్రంలోని యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా కూట‌మి ప్ర‌భుత్వ‌ చ‌ర్య‌లు ఉంటాయ‌ని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈరోజు అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల్లో భాగంగా ఆంధ్రా విశ్వ‌విద్యాల‌యంలో అక్ర‌మాల‌పై చ‌ర్చ జ‌రిగింది. వైసీపీ హ‌యాంలో అనే అక్ర‌మాలు జ‌రిగాయ‌ని టీడీపీ ఎమ్మెల్యేలు ప‌ల్లా శ్రీనివాస్‌, గ‌ణ‌బాబు, వెల‌గ‌పూడి రామ‌కృష్ణబాబు, జ‌న‌సేన ఎమ్మెల్యే కొణ‌తాల రామ‌కృష్ణ స‌భ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... ఆంధ్రా యూనివ‌ర్సిటీలో అక్ర‌మాల‌పై విజిలెన్స్ విచార‌ణ జ‌రిపిస్తామ‌ని అన్నారు. ఇన్‌ఛార్జ్ వీసీ ఇప్ప‌టికే విచార‌ణ‌కు ఆదేశించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. ఆ విచార‌ణ నివేదిక అందిన వెంట‌నే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఎమ్మెల్యే గ‌ణ‌బాబు మాట్లాడుతూ.. గ‌తంలో ఏయూ వీసీగా ప‌నిచేసిన ప్ర‌సాద‌రెడ్డి వైసీపీ అధ్య‌క్షుడి త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించార‌ని మండిప‌డ్డారు. ఎంతో పేరున్న ఆంధ్రా విశ్వ‌విద్యాల‌యాన్ని రాజ‌కీయ వేదిక‌గా ఆయ‌న మార్చేశార‌ని ఆరోపించారు. ఏపీలోని ఇత‌ర వ‌ర్సిటీల ప్ర‌క్షాళ‌న కూడా జ‌ర‌గాల‌ని ఎమ్మెల్యే కొణ‌తాల రామ‌కృష్ణ కోరారు. ఏయూ విష‌యంలో నిర్దిష్ట కాలంలో విచార‌ణ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణబాబు పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. 3 టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు - అక్కడే.! ఆ ప్రాంతాలకు మహర్దశ

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. భారీ అల్పపీడనం.! సుడిగాలులు వస్తున్నాయ్!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

నేడు (13/3) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #LokeshSpeech #jagan #comments #viralvideo #lokeshmeeting #ycp #tdp